15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పాఠ్య పుస్తకాల పంపిణీ వేగవంతం

31-05-2025 06:22 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాబోయే విద్యా సంవత్సరం బడులు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలనే ఉద్దేశంతో జూన్ మూడవ తేదీ నాటికి పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) ఆదేశానుసారం శనివారం డీఈఓ వెంకటేశ్వర చారి పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. పాత కొత్తగూడెంలోని పుస్తక నిల్వ గోదాం నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు ఇప్పటికే పుస్తకాల చేరవేయడం జరిగిందన్నారు.

వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు, మండల విద్యా వనరుల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలను చేరవేనున్నట్లు తెలిపారు. జిల్లాకు 5,08,400 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4,54,925,(89.4 శాతం) పుస్తకాలు జిల్లాకు చేరినట్లు తెలిపారు. వచ్చిన మొత్తం పుస్తకాలలో ఎప్పటి వరకు 509 శాతం పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. 23 మండలాల్లో 12 మండలాలకు పుస్తకాలను సరఫరా చేయడం పూర్తయింది అన్నారు. మిగిలిన మండలాలకు మరో రెండు రోజుల్లో చేరవేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి ప్రభుదయాల్ పాల్గొన్నారు.