25 June, 2026 | 3:27 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

కవిరత్న సురేష్ బాబు తోటమళ్లను అభినందించిన ఎస్ టి ఓ తెల్లం సుభద్ర

31-05-2025 06:26 PM

భద్రాచలం (విజయక్రాంతి): ప్రపంచ సాహితీ సదస్సుకి ఎంపిక కావడమే కాకుండా కవిరత్న జాతీయ పురస్కార్ అవార్డు(Kaviratna National Award) పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి సురేష్ బాబు తోటమళ్లను భద్రాచలం సబ్ ట్రెజరీ అధికారిణి తెల్లం సుభద్ర(Sub Treasury Officer Tellam Subhadra) శనివారం ట్రెజరీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ టి ఓ సుభద్ర మాట్లడుతూ... తమ ట్రెజరీ పరిధిలోని తేగడ హైస్కూలు లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ కవిరత్న పురష్కార్ పొంది భద్రాద్రి ఖ్యాతి జాతీయ స్థాయిలో పెంపొందించారని కొనియాడారు. 

ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్, బెస్టు ఎంఎల్వో, బెస్టు ఎం.హెచ్.ఓ అవార్డ్స్ తో పాటు పలు రంగాలలో అవార్డ్స్ తీసుకోవడం, ఇటీవల విడుదలయిన పదో తరగతి ఫలితాలలో సైన్స్ సబ్జెక్టు నందు నూరు శాతం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసి భవిష్యత్ లో మరిన్ని ఆవార్డ్స్ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం నందు సీనియర్ అకౌంటెంట్స్ కె .క్రాంతి కుమార్, ఎం .ఉషారాణి, ఓ ఎస్ రంజాన్ లు పాల్గొన్నారు.