12-05-2025 01:16:18 AM
55 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): సో మాజిగూడలో ఆదివారం నల్లగొండ జిల్లాలోని మల్టీపర్పస్ హైస్కూల్ 1970 బ్యాచ్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. సుమారు 55 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వా రందరూ ఆరు పదుల వయస్సు దాటిన వారే. 55 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారం తా ఒకరినొకరు ఆప్యాయంగా అరేయ్ ఎలా ఉన్నావురా అంటూ పలకరించుకున్నారు.
చదువుకున్నప్పటి రోజులు, గురువులు, వారి బోధనలను గుర్తు చేసుకున్నారు. నాటి చదువులకు ఇప్పటికీ చాలా తేడా ఉన్నదని వారు పేర్కొన్నారు. నాటి గురువులు నేర్పిన చదువు, సంస్కారం వల్లే తాము ఉన్నత స్థానాలకు చేరకున్నామని వారు చెప్పారు. కాగా ఏఠూ నుంచి జీఠూ వరకు సుమారు 400 మంది విద్యార్థులుండే వారని, ప్రస్తుతం 81 మంది మాత్రమే వచ్చారంటూ వారు తెలిపారు.
చదువు, ఉద్యోగం, పిల్లలు, వారి పెంపకం, వివాహాలు ఇలా క్షణం తీరిక లేకుండా ఇన్ని రోజులు గడిపిన తమకు ఆత్మీయ సమ్మేళనం జోష్‌ను నిం పిందని చెప్పారు. అన్ని బాధ్యతలు తీరి ఈ వయస్సు వచ్చాక ఒకరినొకరు అందుబాటులో ఉందామని అభిప్రాయపడ్డారు.
ఓ వా ట్సాప్ గ్రూప్‌ను తయారు చేసి ప్రతి ఏడాది ఈ వేడుకను నిర్వహించకుందామంటూ తీ ర్మానించారు. కాగా వచ్చిన వారిలో విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఉన్నారు. మనవళ్లు, మనవరాండ్లతో ఈ సమ్మేళనానికి వచ్చారు.