calender_icon.png 14 May, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బోల్తా పడి- నేవీ ఉద్యోగి భార్య మృతి

12-05-2025 01:16:17 AM

స్వగ్రామం నుంచి ఉద్యోగానికి వెళ్తుండగా ప్రమాదం 

కామారెడ్డి, మే 11 (విజయ క్రాంతి): స్వగ్రామం నుంచి ఉద్యోగానికి వెళ్తున్న ఓ నేవీ ఉద్యోగి తన భార్యతో కలిసి కారులో వెళుతుండగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మర్కల్ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి భార్య ప్రణీత(19) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సదాశివ నగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

అదిలాబాద్ జిల్లాకు చెందిన అమూల్ నేవీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. స్వగ్రామమైన ఆదిలాబాద్ కు వచ్చి భార్య ప్రణీతను వెంటపెట్టుకొని కారులో ఉద్యోగం చేసేందుకు విశాఖపట్నం వెళ్తుండగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడగా కారులో ఉన్న అమూల్ భార్య ప్రణీత (19) అక్కడికక్కడే మృతి చెందగా అమూల్  సీట్ బెల్ట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది.

కళ్ళముందే భార్య ప్రాణాలు కోల్పోవడం నేవి ఉద్యోగి అమూల్ కంటతడి పెట్టడం స్థానికులను కల్చివేసింది. సదాశివ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేవీ ఉద్యోగి అమూల్ భార్య శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఎదురుగా వస్తున్న  వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడడంతో నేవి ఉద్యోగి భార్య ప్రణీత మృతి చెందినట్లు  సదాశివనగర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.