జీహెచ్ఎస్‌లో ఘనంగా క్రీడా దినోత్సవం, మహిళా దినోత్సవ వేడుకలు
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాల హనుమకొండ లో క్రీడా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు పాఠశాల ఆవరణలో ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకతీయ యూనివర్సిటీ ఎకనామిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు రాబోయే బోర్డు పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల సాధికారత, సమానత్వం ప్రాధాన్యతపై ప్రసంగాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్ర రమేష్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్ ప్రిన్సిపాల్ డా. లేతాకుల వెంకట్రాం రెడ్డి, గంప అశోక్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




