10 March, 2026 | 10:00 PM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

10-03-2026 06:36 PM

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్

వనపర్తి,(విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెరువులు, కాలువలు మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా స్వచ్ఛతను పాటించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తకోట మున్సిపాలిటీలోని చెనిగే చెరువు కట్ట వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెరువులు, కాలువలు మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా స్వచ్ఛతను పాటించాలని ప్రజలకు సూచించారు.

మున్సిపల్ అధికారులు, సిబ్బంది పారిశుధ్య నిర్వహణలో మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పి అరుణ, వైస్ ఛైర్ పర్సన్ పల్లవి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.