26 March, 2026 | 3:52 PM

Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •  

గూఢచారి కొత్త లుక్

23-10-2024 12:00 AM

ఖుషీ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘వీడీ12’గా రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తు తం మన్నార్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గూ ఢచారి పాత్రలో నటిస్తున్నా రు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఒక ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ క్యాప్ పెట్టుకుని గడ్డంతో సీరియస్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు విజయ్ ఏవో ఒక అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది.