24 June, 2026 | 12:37 AM

శ్రీచరణి @నెం.1

24-06-2026 12:10 AM

తెలుగమ్మాయి శ్రీచరణి చరిత్ర సృష్టించింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.  శ్రీచరణి అనతికాలంలోనే భారత మహిళల జట్టులో మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్‌గా మారింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ విజయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. 

  1. చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి
  2. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం

దుబాయి, జూన్ 23 : భారత మహిళల క్రికెట్‌లో తెలుగమ్మాయిల హవా పెరుగుతోంది. అది కూడా అంత ర్జాతీయ స్థాయిలో మన తెలుగుతేజాలు దుమ్మురేపుతున్నారు. గతంలో మిథాలీరాజ్ మహిళల క్రికెట్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో అందరికీ తెలుసు. ఆమె స్ఫూర్తితో చాలా మంది ఇప్పుడు జాతీ య జట్టులో అదరగొడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటుతూ ఐసీసీ ర్యాం కింగ్స్‌లోనూ దూసుకెళుతున్నారు. తాజాగా తెలుగమ్మాయి శ్రీచరణి చరిత్ర సృష్టించింది.

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెం బర్ వన్ బౌలర్‌గా నిలిచింది. తాజాగా ప్రకటించిన  టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇం గ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది. కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా నిలిచింది. గత ఏడాది జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ తో అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టింది. చిన్నతనంలో బ్యాడ్మింటన్, ఖోఖో ఆడిన శ్రీచరణి, తన మేనమామ ప్రోత్సాహం తో క్రికెట్ వైపు అడుగులు వేసింది.

దేశవాళీ టోర్నీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.  శ్రీ చర ణి కెరీర్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒక మై లురాయిగా నిలిచింది. డబ్ల్యూపీఎల్‌లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లతో కలిసి ఆడటం, అంతర్జాతీయ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందడం ద్వారా తన ఆలోచనా విధానాన్ని, నైపుణ్యాలను మరింత పదు ను పెట్టుకుంది. ఒత్తిడి సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉంటూ జట్టుకు బ్రేక్ త్రూలు ఎలా అందించాలో బాగా నేర్చుకుంది.

ఆ అనుభవమే ఇప్పుడు దేశం తరఫున ఆడేటప్పుడు ఎం తగానో ఉపయోగపడుతోంది. నవంబర్ 2025లో జరి గిన మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయంలో ఆమె తన స్పిన్ మాయాజాలంతో కీ లకపాత్ర పోషించింది. దేశీయ క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి న శ్రీ చరణి.. బ్యాటర్ల ను ఒత్తిడిలోకి నెట్టడం లో ప్రత్యేక శైలిని అలవర్చుకుంది. లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ చేయ డం, పిచ్ నుంచి వచ్చే టర్న్ సరిగ్గా ఉపయోగించుకోవడంలో బాగా రా టుదేలింది.

అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన మొదటి మ్యాచ్‌లోనే తన అద్భుతమైన స్పెల్‌తో తనేంటో ని రూపించుకుంది. కేవలం 21 సంవత్సరాల వయసు లోనే శ్రీ చరణి భారత జట్టు నమ్మదగిన స్పిన్నర్ గా మారిపోయింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ౩ మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టింది.