హైదరాబాద్ ఈ చాంపియన్స్ బోణీ
తెలంగాణ టీ20 లీగ్
హైదరాబాద్, జూన్ 23 : టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బోణీ కొట్టిం ది. టైటిల్ ఫేవరెట్స్‌గా ఒకటిగా ఉన్న హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రుకర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సా ధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాలమూరు 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ రాయుడు (35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రతీక్ పవార్(30), విఘ్నేశ్ రెడ్డి (30) పర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లు అద్భుతం గా రాణించారు.
అజయ్ దేవ్‌గౌడ్ 4 వికెట్లు పడగొట్టగా...యశ్వీర్ గౌడ్ 2, ప్రణవ్ వర్మ 2, శ్రీనికేత్ 1 వికెట్ తీసారు. తర్వాత ఛేజింగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ దూకు డుగా ఆడింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి 13 బంతుల్లోనే 35 (5 ఫోర్లు,2 సిక్సర్లు) రన్స్‌తో అది రిపోయే ఆరంభాన్నిచ్చాడు.
తర్వాత అన్విత్ రెడ్డి, గణేశ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి జోరుతో హైదరాబాద్ 15.4 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. అన్విత్ రెడ్డి 53 (4 ఫోర్లు, 2 సిక్సర్లు), గణేశ్ 50 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అన్విత్‌రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యా చ్ అవార్డు లభించింది. మరో మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన మెదక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేయగా.. ఛేజింగ్‌లో రంగారెడ్డి రైజర్స్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది.






