24 June, 2026 | 1:43 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

24-06-2026 12:37 AM

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వథామారెడ్డి 

ఎల్బీనగర్, జూన్ 23 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శి అశ్వథామ రెడ్డి డిమాండ్ చేశారు. హయత్ నగర్ -1 డిపోలో మంగళవారం జరిగిన టీఎంయూ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్య ఏర్పాటు లో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు.

ఈ సందర్భంగా టీఎంయూ హయత్ నగర్ -1 డిపో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగాదామోదర్ రెడ్డి, కార్యదర్శిగా మైస నరేశ్, కోశాధికారిగా పారంద మహిపాల్, గ్యారేజ్ కార్యదర్శిగా మూల వెంకటేశ్ గౌడ్ తోపాటు కమిటీ సభ్యులుగా 82 మందిని  ఎన్నుకున్నారు. అనంతరం  డిపో మేనేజర్ లావణ్య ను కలిసి ఉద్యోగుల హక్కులను సాధించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి ఎస్ హెచ్ కే రెడ్డి, రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు వైఆర్ రెడ్డి, లక్ష్మీకాంత్,  కరుణ, డిపో నాయకులు  భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్ తోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు