17 April, 2026 | 10:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శ్రీ బీరన్న కామరాతి స్వామి బోనాల పండుగ మహోత్సవాలు..

26-05-2025 05:32 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు..

హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ పరిధిలోని హసన్ పర్తి శ్రీ బీరన్న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బీరన్న కామరాతి కళ్యాణ మహోత్సవంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు(Wardhannapet MLA KR Nagaraju) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. తొలుత గొల్ల గొంగడి కప్పి ఘన స్వాగతం పలికిన గొల్ల కురుమ సోదరులు, గొల్ల కురుమ ఏర్పాటు చేసిన బోనాలను ఎత్తిన ఎమ్మెల్యే నాగరాజు. హసన్ పర్తి లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గొల్ల కురుమ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వీరన్న కామారాతి బోనాల పండుగలో పాల్గొని బోనమెత్తి, ఆలయంలో ప్రత్యేక పూజ స్వామి వారి ఆశీస్సులు పొందడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే గుడికి వచ్చే కచ్చ రోడ్డుకు 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి, త్వరలోనే రోడ్డు నిర్మాణం చేసి విధంగా కృషి చేస్తానని గొల్ల కురుమ సోదరులకు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టిపిసిసి సభ్యులు నమ్మిండ్ల శ్రీనివాస్, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, ఆరెల్లి వెంకటస్వామి, వింజయమూరి వెంకటేశ్వర్లు, పోతరాజు ప్రభాకర్, నన్నెం శెట్టి స్వామి, జన్ను రవీందర్, మేకల ఆనంద్, బస్కూరి శ్రీనివాస్, పెద్దమ్మ  రామ్ నర్సింహులు, వేల్పుల సాంబయ్య, వేల్పుల సంపత్, గొర్రె కిరణ్ కుమార్, తాళ్ల మధు, బిగుల్ల సురేష్, పల్లెపు అనూష, కార్యకర్తలు, గొల్ల కురుమ సోదరులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.