17 April, 2026 | 11:53 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఘనంగా బెల్లి లలితక్క వర్ధంతి

26-05-2025 05:29 PM

పెద్దకొత్తపల్లి: తెలంగాణ మలి దశ ఉద్యమకారిణి, తెలంగాణ గాన కోకిల, జనసభ నాయకురాలిగా పేరొందిన బెల్లి లలితక్క(Belli Lalithakka) 26వ వర్ధంతిని సోమవారం పెద్దకొత్తపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ జనచైతన్య వేదిక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ పిలుపుమేరకు బీసీ, ఎస్సీ నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ జన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు చింతకుంట శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ కోసం మలి దశ ఉద్యమకారిణి, జనసభ నాయకురాలు, గాయకురాలు బెల్లి లలితక్క జీవం పోశారన్నారు.

సమైఖ్య సీమాంధ్ర పాలనలో నాటి టీడీపీ ప్రభుత్వంలో సంఘ వ్యతిరేక శక్తులు బెల్లి లలితక్క చేపట్టిన తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ఆమెను దొంగ చాటుగా హతమార్చి దేహాన్ని 17 ముక్కలు చేసి 17 చోట్ల పడేశారని మండిపడ్డారు. కానీ  ఆమె మనముందు భౌతికంగా లేనప్పటికీ కొనసాగించిన పోరాట చరిత్ర, మరోసారి నెమరు వేసుకున్నారు. బెల్లి లలితక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు యాదవ్, మాజీ ఎంపిటిసి కర్ణ యాదవ్, మాజీ ఎంపీటీసీ వసంతం స్వామి యాదవ్, జాగృతి సేన వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దుల ప్రవీణ్ యాదవ్, మండల అధ్యక్షులు సారాయి వీరయ్య యాదవ్, బెల్లె తిరుమల్ యాదవ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తగిలి వెంకటస్వామి, తోల్ల శ్రీనివాస్ యాదవ్, గోరంట్ల మల్లేష్ యాదవ్, శంకర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, సరాయి శేఖర్ యాదవ్, మద్దని సాయి యాదవ్, వీరస్వామి, దాది చంద్రయ్య యాదవ్, దాది మల్లయ్య యాదవ్, దండు మాసయ్య, మైబుసు, యాదయ్య, మల్లేష్, కళాకారుడు యాదగిరి, పర్వతాలు, బాల పీరు, మల్లయ్య అభిమానులు పాల్గొన్నారు.