15 June, 2026 | 2:47 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

జేఈఈ మెయిన్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ ప్రభంజనం

17-02-2026 12:00 AM
  1. 300కి 300 మార్కులు సాధించిన పసల మోహిత్
  2. మరోసారి జాతీయ స్థాయిలో సత్తాచాటిన శ్రీచైతన్య విద్యా సంస్థలు

హైదరాబాద్, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): ఎన్‌టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 సెషన్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థలు అద్భుత విజయాలను నమోదు చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది జేఈఈ మెయిన్, సీజ న్ 1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా సంచలన రికార్డులు సృష్టించారు. శ్రీచైతన్య విద్యా సంస్థ విద్యార్థి పసల మోహిత్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చాడు.

300కి 300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించి ఇండియాలో నే ఒక్కడిగా నిలిచాడు. అలాగే 290, 285, 280 మార్కులతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులతో పాటు, సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ పర్సంటైట్స్ సాధించి అత్యధిక 100 పర్సంటైల్ స్కోర్లు సాధించి ఈ సంవత్సరం గణ నీయంగా పెరిగి శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘ప్రస్తుత పర్సంటైల్స్‌లోనే కాకుండా, రాబో యే ర్యాంకుల్లో కూడా శ్రీచైతన్య విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారని మాకు న మ్మకం ఉంది.

ప్రత్యేక ర్యాకింగ్ వ్యవస్థే వరుసగా నాలుగేళ్లుగా జేఈఈ మేయిన్‌లో 300కి300 మార్కులతో హం డ్రెడ్ పర్సంటైల్స్ సాధించడానికి ప్రధాన కారణం’ అన్నారు. ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఆన్‌లైన్ యాప్, దేశంలోని అత్యుత్తమ అధ్యాపక బృందం అందించిన శిక్షణ మా విద్యార్థులను విజేతలుగా నిలబెట్టాయి’ అని అన్నారు.