calender_icon.png 19 December, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన శ్రీ జగన్మాత రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు

19-12-2025 08:17:07 PM

భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం..

  ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిడే ఘట్టం..

తాండూర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయి పేట శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.  జాతరకు  భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి షిడే ఘట్టం  అట్టహాసంగా జరిగింది. ఈ ఉత్సవాలను తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.

మంగళవాయిద్యాలు భాజ భజంత్రీలు నడుమ గ్రామపెద్దలు, యువకులు, మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పల్లకీలో షిడె వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం షిడేపైకి  ఎక్కించి సిడేను లాగుతూ ముందు వెళ్తుండగా, వెనక నుంచి రథాన్ని లాగారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాలాల పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.