19-12-2025 08:23:37 PM
* 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర
* అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న చిలిపిచెడు సర్పంచ్
విజయక్రాంతి,పాపన్నపేట: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత అమ్మవారికి పాదయాత్రగా విచ్చేసి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జూల అనిల్ కుమార్ మొక్కు చెల్లించుకున్నారు. కౌడిపల్లి మండలo చిలిపిచెడ్ గ్రామానికి నూతన సర్పంచ్ (బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి)గా గెలపొందిన జూల అనిల్, ఉప సర్పంచ్ కొర్పల శ్రీరామ్, ముఖ్య కార్యకర్తలతో కలిసి చిలిపిచెడు నుండి ఏడుపాయల క్షేత్రానికి 28 కిలోమీటర్ల మేర రహదారి వెంట పాదయాత్ర చేసి శుక్రవారం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపొందగానే అమ్మవారి క్షేత్రానికి పాదయాత్రగా వచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నట్లు వారు తెలిపారు. అమ్మవారి క్షేత్రానికి పాదయాత్రగా రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. వీరి వెంట 65 మంది ముఖ్య నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.