11-05-2025 06:28:47 PM
ముగిసిన దిలాల్పూర్ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
గజ్వేల్: మండల పరిధిలోని బిలాల్పూర్ గ్రామంలో వెలసిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రఘునాథచార్యులు వైదిక నిర్వహణలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నరసింహ జయంతిని పురస్కరించుకొని స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్ర స్నానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి సన్నిధిలో పుష్పర్చన, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు.