రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జువ్వాడి కృష్ణారావును ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నత్తి రాము, ఎద్దులాపురం రమేష్, నరసయ్య, కాంగ్రెస్ గంగారెడ్డి, గాజుల గంగాధర్, మద్దెల స్వామి, కుంచపు రాములు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






