12 June, 2026 | 2:24 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

హనుమకొండలో శ్రీ రక్ష హాస్పిటల్

23-02-2026 01:33 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని 

హైదరాబాద్, ఫిబవరి 22 (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ 100 ఫీట్ల రోడ్డు జవహర్ నగర్ జంక్షన్‌లో శ్రీ రక్ష చిల్డ్రన్, జనరల్ హాస్పిటల్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు, పెద్దలకు అన్ని రకాల సమస్యలకు అత్యుత్తమైన వైద్యం అందించాలని, డాక్టర్లు సేవే మార్గంగా పనిచేయా లని అన్నారు.

పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గణేష్ నాంపల్లి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ స్నేహ సముద్రాల లు మాట్లాడుతూ చిన్న పిల్లలకు శిశు సంరక్షణ, వ్యాక్సినేషన్, పిల్లలు ఎదుగుదల, విష జ్వరాలు, అలర్జీ (అస్తమా), న్యూట్రిషన్ స్పెషలిస్టు అం దుబాటులో ఉంటాయని, పెద్దలకు థైరాయిడ్ సమస్యలు, బిపి, షుగర్, పక్షవాతం, హార్ట్ ఎటాక్, కిడ్నీ సమస్యల వ్యాధులకు అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, అన్ని రకాల వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సముద్రాల శంకర్ పాల్గొన్నారు.