calender_icon.png 23 February, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించిన వారిని హౌస్ అరెస్టు ఏంటి?

23-02-2026 01:32:04 AM

పోలీసుల తీరును ఖండించిన ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయకపోగా, బీజేపీ ఎమ్మెల్యే లను, నాయకులను గృహ నిర్బంధం చేయడం ఏంటని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోలీసులను ప్రశ్నించారు.

కామారెడ్డి లో కాంగ్రెస్ అరాచకం సందర్భంలో ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తమను హౌస్ అరెస్టు చేయడాన్నితీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో స్పందించిన ఒక ప్రజా ప్రతినిధిని ఇలాంటి చర్యలకు గురిచేయడం అన్యాయం అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు శాఖ నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సమయంలో, ఏక పక్షంగా వ్యవహరించడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందన్నారు.

నిన్న జరిగిన ఘటనపై అసలు దోషులపై చర్యలు తీసుకోవాల్సిన బదులు, ప్రశ్నించిన వారినే నిర్బం ధించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత అని, ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేయాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాం డ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని, బాధ్యతా యుతంగా వ్యవహరించాలని ఇతర వర్గాలను హెచ్చరించాడు. ప్రజాస్వామ్య పరిరక్ష ణలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.