29 May, 2026 | 3:52 AM

సర్పంచుల సంఘం జిల్లా కన్వీనర్‌గా శ్రీధర్ గౌడ్ ఏకగ్రీవం

29-05-2026 02:36 AM

జనగామ, మే 28 (విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ లో జరిగిన రాష్ట్ర సర్వసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికల కొరకు జనగామ జిల్లా నుండి నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ను తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు, చింపుల సత్యనారాయణ రెడ్డి, జనగామ జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్ గా ఏకగ్రీవంగా నియమించాడు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆమోదంతో సర్పంచులుగా ఎన్నికైన గ్రామ సర్పంచులు అందరూ చైతన్యవంతులై గ్రామాలను అభివృద్ధి పరచాలని అన్నారు.

కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచుల సంఘం, జనగామ జిల్లా కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్  మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఈపదవి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి  ధన్యవాదాలు  తెలిపారు. జిల్లా సర్పంచులందరూ సమన్వయంగా పనిచేస్తూ పార్టీలకు అతీతంగా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనకు రావలసిన నిధులను పథకాలను ప్రజలకు చేరవేస్తూ మన గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.