18 July, 2026 | 6:07 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

హమ్మయ్య.. మక్కల పైసలు పడ్డయ్!

29-05-2026 02:35 AM

ఒకేరోజు 20 కోట్లు చెల్లింపు 

కేసముద్రం, మే 28 (విజయక్రాంతి): రెండు నెలల క్రితం మొక్కజొన్నలు మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా విక్రయించిన రైతులకు చెల్లింపులు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం 25 కోట్ల రూ పాయల చెల్లింపులు జరగగా అందులో, 20 కోట్ల రూపాయలు ధనసరి సొసైటీ పరిధిలో మక్కలు విక్రయించిన రైతులకు చెల్లించడం విశేషంగా మారింది.

సొసైటీ పరిధిలో ఇప్పటివరకు 3,67,562 బస్తాల మక్కలను 3,887 మంది రైతుల వి క్రయించగా, క్వింటా లకు 2400 రూపా యల చొప్పున మార్క్ ఫెడ్ సంస్థ చెల్లింపులు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చే స్తున్నారు. గురువారం రైతుల సెల్ఫోన్లకు మొక్కజొన్నల విక్రయా లకి సంబంధించిన నగదు జమ చేసినట్లు మెసేజ్‌లు రావడం తో, వానాకాలం సాగు పెట్టుబడికి ఇబ్బంది తొలగిపోయిందని సంబరపడుతున్నారు.