11-06-2025 09:48:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన వెంకటస్వామిని డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు(DCC President Sri R Rao) బుధవారం కలిసి సన్మానం చేశారు. హైదరాబాదులో కలిసి డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలోని సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు. డిసిసి వెంబడి నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమభీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, డైరెక్టర్ నిమ్మ సాయన్న, కాల్వ ఆలయ చైర్మన్ అంగూర్ మహేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ దాసరి శ్రీహరి, మాజీ ఎంపీటీసీలు పడాల శ్రీను, లింగన్న తదితరులు పాల్గొన్నారు.