దమ్మపేట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
22-07-2026 09:34 PM
దమ్మపేట,(విజయ క్రాంతి): మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం పలువురు అనారోగ్య బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సాయంతో పాటు నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ సంక్షేమ సహాయం త్వరితగతిన అందేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు, అత్యవసర వైద్య పరిస్థితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యతని తెలిపారు.






