3 March, 2026 | 7:45 AM

మత్స్యశాఖ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం

03-03-2026 12:00 AM

గరిడేపల్లి మత్స్యశాఖ చైర్మన్ గా దశరథ్

గరిడేపల్లి, మార్చి 2 : గతంలో వివాదంతో వాయిదా పడిన మత్స్యశాఖ ఎన్నికను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గరిడేపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ చైర్మన్ గా చామకూరి దశరథ. వైస్ చైర్మన్ గా ప్రధాని వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కీసర పుల్లయ్యను ఎన్నుకున్నారు. వీరికి జిల్లా కేంద్రంలో డీఎఫ్‌ఓ బానోతు నాగులు నియామక పత్రాలను, బైలాసును అందజేశారు.

కార్యక్రమంలో మాజీ చైర్మన్ ప్రధాని సైదులు,డైరెక్టర్లు జిట్టబోయిన సంతు,ప్రధాని అమరయ్య,మేడారపు సైదులు,ప్రధాని వీరస్వామి,మత్స్యశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు