04-06-2025 06:30:31 PM
అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ (District Youth and Sports Officer) గా జక్కుల శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుత డి.వై.ఎస్ ఓ గా పని చేసిన వెంకటేశ్వర్లు పదవి విరమణ చెందడంతో ఆయన స్థానంలో సీనియర్ పి.డి జక్కుల శ్రీనివాస్ ని డి.వై.ఎస్.ఓ గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డి.వై.ఎస్.ఓ ను పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, డి.ఎస్.ఏ సిబ్బంది బుధవారం కలిసి పుష్పగుచ్చని అందించి అభినందించారు.