17 April, 2026 | 11:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన సంతోష్

04-06-2025 06:39 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ కు చెందిన బాదావత్ సంతోష్ ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్ 25 క్రికెట్ జట్టుకు ఎంపికైనట్లు మహబూబాద్ క్రికెట్ అసోసియేషన్(Mahabubabad Cricket Association) జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్ 25 క్రికెట్ 2 డేస్ లీగ్ టోర్నమెంట్లో ఆరు జిల్లాలు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, ములుగు పాల్గొనగా మహబూబాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన బాదావత్ సంతోష్ అత్యధికంగా 28 వికెట్లు సాధించి, ప్రతిభ చాటడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల కు చెందిన బాదావత్ సంతోష్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటి మానుకోట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అజయ్ సారధి రెడ్డి, కోచ్ వెతుకు కుమార్, సహాయ కోచ్ తోట వినయ్ కుమార్, తోటి క్రీడాకారులు అభినందిస్తూ ఆకాంక్షించారు.