09-10-2024 02:32:11 AM
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసు డు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం వెంకటగిరులు గోవింద నామ స్మరణతో మార్మోగగా, వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి తన్మయత్వం చెందారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించా రు. ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 3.5 లక్షల మంది భక్తులు వాహన సేవలను తిలకించినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల కు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.