1 July, 2026 | 6:46 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

మున్నేరు వాగు‌కు వరద ఉద్ధృతి.. జలదిగ్బంధంలో కాలనీలు

01-09-2024 03:08 PM

ఖమ్మం: ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మంలోని మున్నేరు వరద ఉద్ధృతిలో పరివాహక పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహాకల్ప, వెంకటేశ్వర నగర్, మోతీనర్, బొక్కలగుడ్డ కాలనీలు నీట మునగడంతో స్థానికులు ఇళ్లపైకి చేరుకున్నారు. వరద చట్టుముట్టిన ఇళ్ల నుంచి రక్షించాలని బాధితుల ఆర్తనాదాలు చేస్తున్న వందలాది బాధితులు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా... తిరుమలాయపాలెం మండలం రాకాసితండా జలదిగ్బంధం అయ్యాయి. ఆకేరు వాగు వరద నీరు మొత్తం రాకాసితండాను చుట్టుముట్టింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బందృాలు రాకాసి తండాకు చేరుకుని తండావాసులను కాపాడేందుకు యత్నిస్తున్నారు.  ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్ చర్యలు సాధ్యపడడం లేదని వెల్లడించిన అధికారులు తండావాసులను బోట్ల సహయంతో కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.