గురుకుల ప్రవేశ పరీక్షలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
* 14 మంది విద్యార్థుల ఎంపిక
పాపన్నపేట: తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలో పాపన్నపేట శ్రీ విద్య పాఠశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. పాఠశాల నుంచి 15 మంది విద్యార్థిని, విద్యార్థులు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్షలకు హాజరు కాగా రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ మంగళవారం సాయంత్రం ప్రకటించడంతో శ్రీ విద్య పాఠశాల నుండి మొదటి విడత జాబితాలో 14మంది విద్యార్థిని, విద్యార్థులు 5వ తరగతి ప్రవేశకు అర్హత సాధించారు.
విద్యార్థులు ర్యాంకు సాధించడం కోసం కృషి చేసిన ఉపాధ్యాయులు దుర్గ, సునీత, అనురాధ, షీలా, విలాస్, జ్యోతిరాజ్ ప్రధాన్ లు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ రవీందర్ గుప్తా, కరస్పాండెంట్ లు నిటలాక్షప్ప, సుమన్ లు అభినందించారు. ప్రతి ఏటా తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో ఇలాంటి ఫలితాలు పునరావృతం కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.




