ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిక్కిం దరఖాస్తుల ఆహ్వానం
భారతదేశం, 10 ఆగస్టు 2026: ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిక్కిం తన ఆన్‌లైన్ అండర్‌గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లకు 2026 అకడమిక్ బ్యాచ్ ప్రవేశాలను ప్రారంభించింది. వీటిలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( ఎంబీఎ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ఉన్నాయి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఆమోదం పొందిన ఈ ప్రోగ్రామ్‌లు, సంస్థకు ఉన్న ఎన్ఎఎసీ ప్లస్ గుర్తింపుతో పాటు, సంప్రదాయ క్యాంపస్ ఆధారిత డిగ్రీలకు సమానమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన విద్యార్థులకు ఎస్ఆర్ఎం సిక్కిం నెట్ వర్క్ లో జీవితకాల సభ్యత్వం కూడా లభిస్తుంది. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. అకడమిక్ నైపుణ్యంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన కరిక్యులమ్‌ను ఈ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి.
అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలోని ఆన్ లైన్ బీబీఏ ప్రోగ్రామ్ విద్యార్థులకు బిజినెస్ మేనేజ్ మెంట్, లీడర్ షిప్, ఫైనాన్స్ , మార్కెటింగ్ వంటి అంశాల్లో బలమైన పునాది అందిస్తుంది. దీనితో పాటు బిజినెస్ అనలాటిక్స్ విత్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ లో స్పెషలైజేషన్లను ఎంచుకునే అవకాశం ఉంది.
ఆన్ లైన్ బీసీఏ ప్రోగ్రామ్ విద్యార్థులకు కంప్యూటింగ్ మరియు సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లో కీలకమైన నైపుణ్యాలను అందించడంతో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ అనలిటిక్స్ లో ప్రత్యేక లెర్నింగ్ పాత్‌వేలను అందిస్తుంది. వివిధ రంగాల్లో టెక్నాలజీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలోని ఆన్ లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్లు మరియు ఉద్యోగస్తులు అధునాతన మేనేజ్‌మెంట్ విద్య ద్వారా తమ కెరీర్‌ను వేగవంతం చేసుకునేలా రూపొందించబడింది. కోర్ బిజినెస్ డిసిప్లిన్‌లతో పాటు, విద్యార్థులు పలు స్పెషలైజేషన్లలో తమకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిక్కిం డైరెక్టర్ ఆఫ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ డా. హెచ్.ఎన్.ఉడుపా మాట్లాడుతూ “ఉన్నత విద్యపై అభ్యాసకుల అంచనాలు వేగంగా మారుతున్నాయి. నేటి అభ్యాసకులు కేవలం అకడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే కాకుండా, తమ కెరీర్‌కు అంతరాయం కలగకుండా నేర్చుకునే వెసులుబాటుతో పాటు టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో విజయవంతం కావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే ప్రోగ్రామ్‌ల కోసం చూస్తున్నారు. Sఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిక్కింలో మా ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను సౌకర్యవంతమైనవి, అందుబాటులో ఉండే ఫీజులతో కూడినవి, నాణ్యతతో కూడినవి, విద్యార్థి-కేంద్రీకృతమైనవి మరియు అభ్యాసకులకు అనుకూలమైనవిగా రూపొందించడంపై దృష్టి సారించాము.
బలమైన అకడమిక్ పునాది, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన కరిక్యులమ్, అనుభవాత్మక అభ్యాసం మరియు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో స్పెషలైజేషన్లను కలిపి మా ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను రూపొందించామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిక్కిం తన ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను పోటీతత్వ ఫీజు నిర్మాణంతో అందిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.






