04-02-2026 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 03 (విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వి.సి హాల్ నందు జిల్లాలోని మున్సిపల్ కమీషనర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లతో మున్సిపల్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీలలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ సెంటర్లలో సంబంధిత మున్సిపాలిటీకి చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసిన తదుపరి సాధారణ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదని, కావున అభ్యర్థులు ఇట్టి విషయాన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిప్యూటీ సీఈవో శిరీష, డివిజనల్ పిఓ నారాయణరెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.