25 April, 2026 | 9:42 PM

నామినేషన్ ను విజయవంతం చేయాలి

25-04-2026 08:12 PM

ఆర్యవైశ్య నాయకుడు బోనాల సైదారావు

కోదాడ,(విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ సన్నిధిలోని ఆర్య వైశ్య నిత్యన్నదాన సత్రంకు జరగబోయే కార్యవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదాడ పట్టణానికి చెందిన ఆర్యవైశ్య నాయకుడు బోనాల సైదారావు శనివారం పిలుపునిచ్చారు. సోమవారం జరిగే తన నామినేషన్ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ప్రస్తుతం సైదారావు మట్టపల్లి నిత్యాన్నదాన సత్రం కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సైదారావు గత 17 సంవత్సరాలుగా వాసవీ క్లబ్ లో చురుగ్గా ఉంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసవి క్లబ్ నిర్వహించే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో సైదారావు పాల్గొనడంతో పాటు నందిగామలో కోట్ల రుపాయలు వెచ్చించి ఆశ్రమం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైదారావు ఎల్లప్పుడూ ముందుంటారని పలువురు ఆయన సేవలను గుర్తుచేస్తున్నారు.