25 April, 2026 | 9:26 PM

వాసవి మాత జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం పట్ల హర్షం

25-04-2026 08:06 PM

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు

కోదాడ,(విజయక్రాంతి): వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఆదివారం కోదాడలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాసరావు, తెలంగాణ మలిదిశ ఉద్యమ నేత రాయపూడి వెంకటనారాయణలు శనివారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి లను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పూజల అనంతరం నాగు బండి వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.