25 April, 2026 | 8:55 PM

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం

25-04-2026 08:02 PM

గిన్నిస్ వరల్డ్ రికార్డు తైక్వాండో పోటీలకు విద్యార్థుల ఎంపిక

రన్ వీర్ తైక్వాండో మాస్టర్ రమేష్

జవహర్ నగర్,(విజయక్రాంతి): గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తైక్వాండో పోటీలకు రణబీర్ అకాడమీ విద్యార్థులు ఎంపిక ఇవ్వడం అభినందనీయమని మాస్టర్ రమేష్ అన్నారు. హైదరాబాదులోని జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్  తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న పోటీలో కౌకూర్ రన్వీర్ విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. థైక్వాండో ఆత్మ రక్షణకు మానసిక ప్రశాంతతకు నిలయంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. రన్వీర్, శ్రేయస్ లు  తైక్వాండో పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. గిన్నిస్ రికార్డులో ఆరు నుండి 60 ఏళ్ల వయసు గల వారు తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.