అన్ని వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
- కార్పొరేషన్ ల చైర్మన్ లు రమేష్ రెడ్డి వీరయ్య
సూర్యాపేట,(విజయక్రాంతి): అన్ని వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, దివ్యాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య లు అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా దివ్యాంగ లబ్దిదారులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా అందించే రెట్రో ఫిట్మెంట్ స్కూటీలు, అంగన్వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్ ల కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమక్షంలో సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదితతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులు, మహిళలు ఆత్మవిశ్వాసంతో తమ స్వశక్తితో ఇంకా అభివృద్ధి చెందాలని, అంగన్వాడి మహిళలకు అందించిన 5జి స్మార్ట్ ఫోన్లతో నైపుణ్యాన్ని పెంచుకొని వాటి ద్వారా చిన్న పిల్లలకు ఆటలు, పాటలు, రైమ్స్ నేర్పిస్తూ వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేణారెడ్డి , వైస్ చైర్ పర్సన్ షఫీ వూల్ల, ఆర్డీఓ వేణుమాధవ్ , ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , సంక్షేమ అధికారి కె. నరసింహరావు, అధికారులు, సిడిపివో, అంగన్వాడీ సూపర్ వైజర్స్, జిల్లా ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






