13 April, 2026 | 10:02 AM

స్టాండర్డ్ క్యాపిటల్ రూ.500 కోట్ల ఎన్‌సీడీల జారీ

19-12-2024 12:00 AM

 హైదరాబాద్, డిసెంబర్ 18: నాన్ బ్యాం కింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) స్టాండ ర్డ్ క్యాపిటల్ మార్కెట్స్ తమ మూలధన వ్యవస్థను పటిష్టపర్చుకునేందుకు, వృద్ధి చర్యలను చేపట్టేందుకు రూ.500 కోట్ల విలువైన నాన్ డిబెంచర్లను జారీచేస్తున్న ట్లు వెల్లడించింది. ఇందులో ఇప్పటికే రూ. 130 కోట్ల నిధుల్ని సమీకరించి, కంపెనీ విస్తరణ కార్యకలాపాల్లో పెట్టుబడి చేసినట్లు స్టాండర్డ్ క్యాపిటల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎన్‌సీడీల జారీచేసి సమీకరించే ఇతర నిధుల్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరా లు, ప్రస్తుత రుణాల తగ్గింపుతో సహా వివిధ వ్యూహాత్మక ప్రయోజనాలకు వినియోగిస్తామని కంపెనీ వివరించింది.