ఫెడరల్ బ్యాంక్‌తో ఎకోఫై జట్టు
ఎంఎస్‌ఎంఈలకు రూఫ్‌టాప్ సోలార్ ఫైనాన్సింగ్
హైదరాబాద్, డిసెంబర్ 18: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్స్ కోసం ఫైనాన్స్ చేసేందుకు ప్రైవేటు రంగ ఫెడరల్ బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ ఎకోఫైలు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాణిజ్యపరమైన రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్స్‌లో పెట్టుబడికి ఆసక్తికలిగిన ఎంఎస్‌ఎంఈలకు ఎకోఫైతో కలసి వినూత్న ఫైనాన్సింగ్ ఆప్ష న్లు అందించనున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాలిని వారియర్ తెలిపారు. ఈ కోలెండింగ్ కార్యక్రమం ద్వారా 3,600 కిలోవాట్ల వార్షిక రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లకు ఫైనాన్స్ చేయడం ద్వారా2,500 టన్నులను మించిన సీవో2 ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేశంలో ఏకైక గ్రీన్-ఒన్లీ ఎన్‌బీఎఫ్‌సీ ఎకోఫై సహవ్యవస్థాపకురాలు రాజశ్రీ నంబియార్ తెలిపారు.




