13 April, 2026 | 11:48 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

కొత్త కనిష్టానికి రూపాయి

19-12-2024 12:00 AM

84.94 స్థాయికి కరెన్సీ విలువ

ముంబై, డిసెంబర్ 18: డాలర్ బలోపే తం అవుతున్న నేపథ్యంలో ఇతర వర్థమాన కరెన్సీల బాటలోనే రూపాయి పతనం కొనసాగు తున్నది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ మరో 3 పైసలు నష్టపోయి రికార్డు కనిష్ఠస్థాయి 84.94 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ  రూపా యి 30 పైసల మేర నష్టపోయింది. పపంచ మార్కెట్లో యూఎస్ డాలరు బలపడటం, స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవడం దేశీ కరెన్సీని దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.