24 April, 2026 | 12:54 PM

Breaking News

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే   •   ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •  

రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!

24-04-2026 11:21 AM
  1. డిపో నుండి పట్టణ పురవీధుల గుండా కార్మికుల పాదయాత్ర.
  2. అద్దె బస్సులు మినహా డిపో నుండి కదలని ఆర్టీసీ బస్సులు. 
  3. ముందుకు రాని ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు.  
  4. మూడో రోజు ఉదృత రూపంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులంతా(RTC workers strike) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల్ని మరింత ఉధృతం చేస్తున్నారు. మనస్థాపంతో తోటి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడడంతో తన ఆత్మ శాంతి కలగాలని ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో నుండి కార్మికులంతా పాదయాత్రగా పూర వీధుల గుండా బస్టాండ్ ముందు మానవహారం చేపట్టారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు(RTC Workers) మాట్లాడుతూ ఎంతోకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని చేపడుతున్నామని వారిని పట్టించుకోని ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదన్నారు. గొంతెమ్మ కోరికలు ఏమి కూరలేదని ఆర్టీసీ రక్షణ కోసం ఉద్యోగ భద్రత కోసం అహర్నిశలు శ్రమించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వెనుక ఏదో శక్తి ఉందని అందుకే సమ్మె చేపడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి డిమాండ్ల సాధనకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

మూడో రోజు కూడా ఆర్టీసీ అద్దె బస్సులు మినహా ఆర్టీసీ బస్సులు ముందుకు కదలకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు అధిక చార్జీలు వసూళ్లకు  పాల్పడుతున్నారని సామాన్య ప్రయాణికులు వాపోతున్నారు.

సమ్మె వల్ల ప్రజలకు ఏమైంది?
ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు