26 July, 2026 | 1:57 AM

స్టార్‌షిప్ ప్రయోగం సక్సెస్

26-07-2026 12:00 AM
  1. టెక్సాస్ స్టార్‌బేస్ నుంచి ప్రయోగం
  2. ఎలన్ మస్క్ హర్షం

టెక్సాస్, జూలై 25: స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ సంస్థకు చెందిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భారీ రాకెట్ ‘స్టార్‌షిప్’ 13వ ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం 4 గంటలకు దక్షిణ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి స్టార్‌షిప్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టారు. అయితే ఈ ఉపగ్రహాలు విజయవంతంగా ఉపకక్ష్య మార్గంలో ప్రయాణించాయి.

వీటిని అంతరిక్షంలో శాశ్వతంగా ఉండేలా రూపొందించలేదు. దీంతో ప్రయోగించిన 20 నిమిషాల తరువాత అవి భూ వాతావరణంలోనే కాలిపోయాయి. ఈ ప్రయోగం గంటపాటు కొనసాగింది. ఈ ప్రయోగంలో రాకెట్ పై భాగం హిందూ సముద్రంలో, బూస్టర్ మెక్సికో గల్ఫ్‌లో దిగాయి. గతవారమే ప్రయోగం జరగాల్సి ఉన్నా సాంకేతిక సమస్య వల్ల ప్రయోగం వాయిదా పడింది.

ఈ రాకెట్ విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మానవులు చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వియోగ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లయ్యింది. కాగా రాకెట్ బూస్టర్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో ల్యాండ్ కావాల్సి ఉండగా నియంత్రణ కోల్పోయి దెబ్బతింది. స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఎలన్ మస్క్ హర్షం వ్యక్తం చేసింది.