7 March, 2026 | 6:36 AM

ఇందిరమ్మ గృహాలకు భూమిపూజ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు..

18-06-2025 07:36 PM

తూంకుంట ఆంక్ష రెడ్డి..

తూప్రాన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ గృహాల పథకాన్ని అమలుపరిచింది. ఇందులో భాగంగా తూప్రాన్ మండలం యావాపూర్ లో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి(State Congress Vice President Anksha Reddy) బుధవారం ముగ్గు పోసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందన్నారు.

ప్రజలు ఎలాంటి అపోహాలకు గురి కావద్దని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టు కుంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ఎంజాల స్వామి, మండల నాయకులు జింక మల్లేశం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రామస్వామి చైర్మన్, నీళ్ల నాగరాజు నరేందర్ రెడ్డి హేమలత సావిత్రి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.