20-01-2026 07:06:13 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఇల్లందు ఏరియా జి.ఎం. వి.కృష్ణయ్య అధికారులకు సూచించారు. జి.ఎం చాంబర్ నందు మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక రన్స్ & గోల్డ్ స్టేడియం 24 ఏరియా నందు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ, సెక్యూరిటీ సిబ్బందిచే గౌరవ వందనం, ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, సాంస్కృతిక కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో యస్వో టు జియం రామస్వామి, ఏరియా ఇంజనీర్ నరసింహ రాజు, కే.ఓ.సి. పి.ఓ గోవిందరావు, డీజీఎం (పర్సనల్)అజ్మీర తుకారాం, డీజిఎం (సివిల్) రవి కుమార్, డి.యై సి.యం ఓ డా,,వెంకట నరసింహ రావు, జే.కే. మేనేజర్ పి.పుర్ణచందర్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు అని అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అన్నారు.