రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
28-05-2024 01:36 AM
బీఆర్‌ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ పిలుపు
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి) : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు జరపాలని సూచించారు. జూన్ ఒకటో తేదీన సాయంత్రం 7 గంటలకు గన్‌పార్కు నుండి ట్యాంక్‌బండ్ వద్దగల అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీతో నివాళులర్పించనున్నట్లు తెలిపారు. 2న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు పలు దవా ఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తా రు. 3వ తేదీన పార్టీ కార్యాలయాల్లో ముగింపు వేడుకల్లో భాగంగా పార్టీ జెండాతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.






