31 July, 2026 | 8:55 PM

సన్నబియ్యం గింజ కొనలేదని చెప్పడం హాస్యాస్పదం

28-05-2024 01:35 AM

మంత్రుల వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేత రవీందర్‌సింగ్ విమర్శలు 

కేటీఆర్ ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానం దాట వేశారని ఎద్దేవా

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి) : పౌరసరఫరాల శాఖ అవి నీతిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమాధానం చెప్ప కుండా దాటవేశారని పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్  మాజీ చైర్మన్  రవీందర్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటల్లో నిజం లేదని, ఆయనకు అకారం పెరిగిందే తప్ప ఆలోచన పెరగలేదని ఎద్దేవా చేశా రు. సన్నబియ్యం గింజ తీసుకోలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా ఎదుట ధ్వజమెత్తారు.

రూ.200 కోట్ల మేర టెండర్లు దక్కించుకున్న వారు ధాన్యం కొనలేదని అబద్ధాలు చెబుతున్నారని, తమ పార్టీ 15 రోజుల క్రితమే  ఈ అవినీతిపై ప్రశ్నించిందని పేర్కొన్నారు.  అలాంటప్పడు టెండర్లు ఎందుకు పిలిచారని, రూ. 57తో సన్న బియ్యం కొనాలని ప్రభుత్వమే టెం డర్లలో ధర నిర్ణయించింది నిజం కాదా ప్రశ్నించారు.  ప్రభుత్వమే అంత స్థాయిలో ధర నిర్ణయిస్తే బహిరంగ మార్కెట్‌లో ధరల పరిస్థితి ఏమిటని, ఇది ప్రజలపై భారం మోపడమేనని మండిపడ్డారు. 

ధాన్యానికి రూ.2007లు టెండర్లలో నిర్ణయిస్తే,  ఏజెన్సీలు రైస్‌మిల్లర్ల దగ్గర రూ. 2230 వసూలు చేయ డం నిజం కాదా నిలదీశారు. యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్ అసత్యాలు మాట్లాడుతున్నారని, ఆదా యం పెంచుతామని చెబుతున్న మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ ఏవిధంగా పెంచారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ పాత్ర లేకుంటే  టెండర్లు రద్దు చేసి నిజాయితీ నిరూపించకోవాలని సవాల్ చేశారు.