11-11-2025 12:28:57 AM
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
రాజేంద్ర నగర్, నవంబర్ 10 (విజయక్రాంతి): కార్మిక చట్టాలను అమలు చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం మీన వేషాలు వేస్తే, కార్మికులు పోరాటానికి సిద్ధంగా ఉండాలని సిఐ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాటేదాన్ లో సిఐ టి యూ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభ కాటేదాన్‌లో గుంటి యాదయ్య ప్రాంగణంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ కార్మికుల హక్కుల కోసం సీ ఐ టి యూ నిరంతరం పోరాడుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమల్లో కార్మికు లకు అందాల్సిన సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. సిఐ టి యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ... కార్మిక చట్టాలను అమలు చేయకుంటే యావత్తు భారతదేశం మొత్తం తమ హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకోసం కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ వారు మాట్లాడుతూ గుంటి యాదయ్య అడ్వకేట్ వృత్తిలో ఉండి గగన్ పాడు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల అండగా ఉంటూ కార్మికులకు హక్కుల వివరాలు తెలుపుతూ పోరాటాలకు మద్దతునిస్తూ తన చివరి ప్రాణం వరకు కార్మికుల పక్షపాతిగా ఉండి ఈ మధ్యకాలంలోనే అమరులయ్యారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పారిశ్రామిక క్లస్టర్ ఉన్నాయని అందులో పని చేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులతో శ్రమదోపిడి చేసుకుంటూ కార్మిక హక్కులను కాలరాస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలలో కార్మికుల చట్టాల ఆధారంగా కార్మికులకు వేతనాలు ఇతర బెనిఫిట్స్ కల్పించాలన్నారు.
రాష్ట్రంలో 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని అమలు కానివ్వట్లేదు వలస కార్మికుల జీవితాలు మారాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వలస కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. కేంద్రం లో ఎన్ డి ఏ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలనే రద్దుచేసి కార్పొరేట్ పెట్టుబడి ధరలకు అనుకూలంగా మారిందని విమర్శించారు. ఇంతకుముందు భారీగా తరలివచ్చిన కార్మికులు రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్, కోశాధికారి జి కవిత, ఉపాధ్యక్షులు. జాజాల రుద్ర కుమార్, అల్లి దేవేందర్,కీసరి నర్సిరెడ్డి,జగదీష్, కిషన్, బిసా సాయిబాబు, సహాయ కార్యదర్శిలు బ్రహ్మయ్య, ఎస్ రామ్మోహన్ రావు. స్వప్న,వీరయ్య, సునీత,జిల్లా కమిటీ సభ్యులు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.