13-01-2026 10:08:06 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలపై ఉప ముఖ్యమంత్రితో విప్ చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విప్ కోరారు. అలాగే కథలాపూర్ మండల కేంద్రంలో నూతన సబ్‌స్టేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
ఇటీవల రుద్రంగి మండల కేంద్రంలో నూతన 220 కేవీ సబ్‌స్టేషన్‌కు నిధులు మంజూరు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో ఇప్పటివరకు మంజూరు చేసిన అన్ని సబ్‌స్టేషన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని విప్ ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు.