17 April, 2026 | 7:15 AM

1న బీసీల రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం

30-05-2025 12:32 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు, దేశ వ్యాప్తంగా కుల గణన, భవిష్యత్ బీసీ ఉద్యమ కార్యాచరణ అంశంపై జూన్ 1న హైదరాబాద్‌లోని కళింగ భవన్‌లో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్  గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు. 33 జిల్లాల నుంచి సంఘం అనుబంధ సంఘాల బాధ్యులు, బీసీ సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గాల బాధ్యులు హాజరవు తున్నారని పేర్కొన్నారు.