15-07-2025 12:00:00 AM
నిర్మల్, జూలై ౧౪(విజయక్రాంతి): నిర్మల్ లోని కొండాపూర్‌లోగల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్న ట్టు స్టార్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో అండర్ 19 బాలు రు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్ డబుల్స్ వి భాగాలలో బ్యాడ్మింటన్ పోటీలు ఉంటాయని తెలిపారు.
జూలై 17న క్వాలిఫైయింగ్ పోటీలు, జూలై 18 తేదీ నుంచి 20వ తేదీ వరకు మెయిన్ డ్రా పోటీలు ఉంటాయ ని తెలిపారు. 18వ తేదీ ఉదయం 10గంటల కు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవం ఉంటుందని ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ హాజరవుతారని తెలిపారు. జూలై 20 తేదీన ఫైనల్ పోటీలు జరుగుతాయని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారుగా 400 మంది వరకు బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్ గౌడ్, మహేష్, ప్రణీత్, నంద కుమార్, పెటా సంగం జిల్లా ప్రెసిడెంట్ భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.