15-07-2025 09:36:02 AM
హైదరాబాద్: మెదక్ జిల్లాలో(Medak District) కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు మరెల్లి అనిల్(28)( Congress SC cell leader Marelli Anil) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు అనిల్ కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి స్వగ్రామం పైతర వస్తుండగా మెదక్ జిల్లా కొచ్చారం మండం వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుంది. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి అనిల్ రోడ్డు ప్రమాదంలో చినిపోయారని పోలీసులు బావించారు. కొచ్చారం ఎస్ఐ గౌస్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనిల్ మరణం హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు.