calender_icon.png 15 July, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

14-07-2025 11:27:52 PM

ఇబ్రహీంపట్నం: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం(Ibrahimpatnam Constituency)లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం, గ్రామానికి చెందిన పసులు వెంకటేష్ ముదిరాజ్, భువనగిరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అది గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటేష్ కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఒక మంచి క్రికెట్ క్రీడాకారుడిగా ముద్ర వేసుకున్న వెంకటేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.